News April 10, 2024
సిరిసిల్ల: అత్తింటి వేధింపులు భరించలేక గృహిణి సూసైడ్

అత్తింటి వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. జీనోమ్ వ్యాలీ ఇన్స్పెక్టర్ యాదయ్య గౌడ్ ప్రకారం.. మల్యాలకు చెందిన మాధురి(22)కి.. వేణుతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. శామీర్పేట మండలంలో నివాసం ఉంటూ భర్త వేణు ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. సోమవారం సా. భర్త వచ్చేసరికి మాధురి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉంది. అయితే అత్తింటి వేధింపులతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
Similar News
News March 26, 2025
KNR: అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం అందించాలి : కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగింది. కేసు పూర్వాపరాలను పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే విధంగా అధికారులు చర్య తీసుకోవాలన్నారు.
News March 26, 2025
KNR: సరైన అవగాహన.. సైబర్ నేరాలకు నివారణ

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై రైసింగ్ సన్ యూత్ క్లబ్ సహకారంతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈజీ మనీ కోసం ఆశపడి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ నడిపే వారితో పాటు బెట్టింగ్‌లో పాల్గొనే వారిపై నిఘా ఉంటుందని అన్నారు.
News March 26, 2025
సైదాపూర్: వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

సైదాపూర్ మండలంలోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం ఎవరికైనా జరిగిన విషయం చెబితే చంపుతానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.