News February 17, 2025
సిరిసిల్ల: అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుంచి 116 దరఖాస్తుల స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News December 1, 2025
డీఎస్సీ-2025 టీచర్ల వేతనాల పట్ల ఆందోళన

డీఎస్సీ-2025తో ఎంపికైన టీచర్లకు 2 నెలలు గడిచినా జీతాలు విడుదల కాకపోవడంపై ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ భాస్కర్ ఓ ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త టీచర్లు జీతం రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇతర శాఖల నుంచి ఎంపికైన వారికి లాస్ట్ పే సర్టిఫికెట్, సర్వీస్ రిజిస్టర్ ఇవ్వకపోవడం, డీడీఓ లాగిన్‌లో వివరాలు తొలగించకపోవడంతో విద్యాశాఖ జీతాల బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.
News December 1, 2025
11 పరీక్ష కేంద్రాల్లో.. 2,412 విద్యార్థులు: కలెక్టర్

జిల్లాలోని బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 11 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలకు 2,412 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షా నిర్వహణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, కస్టోడియళ్లను నియమించాలన్నారు. ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎంలను నియమించామని తెలిపారు.
News December 1, 2025
నెల్లూరు: అసంతృప్తిలో కూటమి నాయకులు..!

నెల్లూరు జిల్లాలోని కూటమి నాయకుల్లో అసంతృప్తి చెలరేగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన తమను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి మంత్రులు, MLAలే కాంట్రాక్టర్లుగా మారుతున్నారని వాపోయారు. తమకంటూ ఏ పనులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాగే ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.


