News February 17, 2025

సిరిసిల్ల: అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుంచి 116 దరఖాస్తుల స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Similar News

News April 17, 2026

వెల్గటూర్: స్టేట్ ఫస్ట్ సాధించిన సౌమ్యశ్రీని అభినందించిన టీచర్లు

image

వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని గాలి సౌమ్యశ్రీ జూనియర్ ఇంటర్ పరీక్షల్లో 470కి 469 మార్కులు సాధించి రాష్ట్ర తొలి స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులసి ఆగమయ్య, ఉపాధ్యాయ బృందం, వార్డు సభ్యులు పాల్గొని అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఢిల్లీ హైకోర్టుకు అల్లు అర్జున్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్సనాలిటీ రైట్స్ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్ తదితర నటులు సైతం ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.