News April 4, 2025

సిరిసిల్ల: అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేయాలి: అదనపు కలెక్టర్

image

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ రేషన్ కార్డుల జారీపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజాపాలన, మీ సేవా, ఇతర మార్గాల ద్వారా రేషన్ కార్డుల జారీ కోసం వచ్చిన 30,977 దరఖాస్తులు వచ్చాయన్నారు.

Similar News

News February 24, 2026

నేడు ఆదిలాబాద్‌కు కేటీఆర్

image

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల అరెస్టై ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను 11 గంటలకు ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు.

News February 24, 2026

నెల్లూరులో లారీ ఢీకొని బెస్ట్ ఫ్రెండ్స్ మృతి

image

నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన హేమేంద్ర(22), వెంకటేశ్వరపురానికి చెందిన నూరుల్లా(20) మంచి స్నేహితులు. హేమేంద్ర కారు షోరూములో టెక్నీషియన్‌గా, నూరుల్లా ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరు బైకుపై హైవే మీదుగా వెంకటేశ్వరపురానికి బయల్దేరారు. చెన్నై వైపు నుంచి కావలి వైపు వెళ్తున్న లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో స్నేహితులు ఇద్దరూ చనిపోయారు.

News February 24, 2026

ఖమ్మం: ‘సౌర’ సిరి రూ.12 కోట్లతో సోలార్ ప్లాంట్లు!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం మహిళల జీవితాల్లో వెలుగులు నింపనుంది. నాలుగు సోలార్ ప్లాంట్లు మంజూరు కాగా, ఒక్కో ప్లాంట్‌ను ఒక మెగావాట్ సామర్థ్యంతో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఎర్రుపాలెం మండలం రాజుపాలెంలో పైలట్ ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కంలకు విక్రయించి ఆదాయం పొందనున్నారు.