News February 20, 2025
సిరిసిల్ల: అసత్య ప్రచారాలు చేస్తే కేసు నమోదు: కలెక్టర్

సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తనపై వివిధ కేసులు ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని తనపై ఎలాంటి కేసులు లేవని తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు.
Similar News
News November 25, 2025
జగిత్యాల: మాతా, శిశు సంరక్షణపై ‘సంకల్ప్’ శిక్షణ

జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మాతా–శిశు సంరక్షణ, నవజాత శిశువుల సంరక్షణపై సంకల్ప్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య అధికారి డా. ప్రమోద్ కుమార్, జీహెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, గైనక్ హెచ్ఓడీ డా. అరుణ, పిల్లల నిపుణుడు డా. సాయి కిరణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో శిశు మరణాల రేటును 24 నుంచి 10 లోపు తగ్గించేందుకు ఆశా వర్కర్ల ద్వారా అవగాహన పెంపు అవసరమన్నారు.
News November 25, 2025
ఎర్రనల్లితో పంటకు తీవ్ర నష్టం, నివారణ ఎలా?

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.
News November 25, 2025
జగిత్యాల: మహిళా రక్షణ చట్టాలపై అవగాహన

తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్, జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. అధ్యక్షులు, న్యాయవాది హరి అశోక్కుమార్ గృహహింస, లైంగిక వేధింపుల నివారణ, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 16 మంది మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరిశెట్టి విశ్వనాతం, హన్మంత్ రెడ్డి, శ్రీమంజరి తదితరులు పాల్గొన్నారు.


