News February 1, 2025
సిరిసిల్ల: ఆపరేషన్ స్మైల్ 11 విజయవంతం: ఎస్పీ

సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్ 11 విజయవంతమైందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్ల జిల్లాలో మైనర్లతో పని చేయిస్తున్న వారిపై 8 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 31 మంది మైనర్ పిల్లలను కాపాడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించామని స్పష్టం చేశారు.
Similar News
News October 24, 2025
ప్రైవేట్ బస్సులపై 565 కేసులు: మురళీ మోహన్

తిరుపతిలో శుక్రవారం జిల్లా రవాణా అధికారి కొర్రపాటి మురళీమోహన్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై 565 కేసులు నమోదు చేసి రూ.42.95 లక్షలు వసూలు చేసినట్టు తెలిపారు. పర్మిట్ లేకుండా, పన్ను చెల్లించని వాహనాలపై చర్యలు తీసుకున్నామన్నారు. కర్నూలు బస్సు ప్రమాదం వేళ వాహనాల్లో అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు.
News October 24, 2025
కల్వకుర్తి: బస్సు ప్రమాదం.. యువకుడి సాహసం

కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న కల్వకుర్తి నియోజకవర్గం, మాడ్గుల మండలం చంద్రాయన్పల్లికి చెందిన అశోక్ (బీహెచ్ఈఎల్ ఉద్యోగి) ప్రాణాలతో బయటపడ్డాడు. తెల్లవారుజామున బస్సులో మంటలు వ్యాపించడాన్ని గమనించిన అశోక్.. వెంటనే కిటికీ అద్దాలు పగలగొట్టి అందులోంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నాడు.
News October 24, 2025
భీమదేవరపల్లి: గేదెలను తప్పించబోయి కార్ పల్టీ

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎల్కతుర్తి నుంచి ముల్కనూర్ వైపు వెళ్తున్న కారు బోల్తా పడింది. రహదారిపై గేదెలు అకస్మాత్తుగా ఎదురుగా రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వాటిని తప్పించబోయి కారు పల్టీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


