News February 1, 2025

సిరిసిల్ల: ఆపరేషన్ స్మైల్ 11 విజయవంతం: ఎస్పీ

image

సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్ 11 విజయవంతమైందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్ల జిల్లాలో మైనర్‌లతో పని చేయిస్తున్న వారిపై 8 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 31 మంది మైనర్ పిల్లలను కాపాడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించామని స్పష్టం చేశారు.

Similar News

News February 6, 2025

VZM: ‘క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి’

image

క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారిణి జీవన రాణి సూచించారు. వైద్య శాఖ కార్యాలయంలో జిల్లాలో పీహెచ్సీ, సీహెచ్సీ వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతృ సేవలు, జేఎస్ వై, పీఎం మాతృ సురక్ష అభియాన్, తదితర కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శత శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

News February 6, 2025

రేపు వైసీపీలోకి శైలజానాథ్

image

AP: మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరనున్నారు. ఇటీవల ఆయన జగన్‌తో భేటీ కాగా చేరికకు వైసీపీ చీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు ఉ.10 గంటలకు తాడేపల్లిలో శైలజానాథ్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. శైలజానాథ్ అనంతపురం జిల్లా శింగనమల నుంచి 2 సార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.

News February 6, 2025

బోయినిపల్లి: దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న సుడిగాలి సుధీర్

image

బోయినపల్లి మండలంలోని వరద వెళ్లి గ్రామంలో గుట్టపై వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామిని జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈరోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కృప అందరిపై ఉండాలని కోరుకున్నారు. గుట్ట పైన ఎంతో ప్రకృతి అందాలతో బోటు ద్వారా వచ్చి దత్తాత్రేయుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నాగుల సాంబయ్య, భక్తులు ఉన్నారు.

error: Content is protected !!