News March 8, 2025
సిరిసిల్ల: ఆబ్కారీ శాఖ అధికారుల సస్పెన్షన్

సిరిసిల్ల జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి పంచాక్షరి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గులామ్ ముస్తఫాను సస్పెండ్ చేస్తూ వరంగల్ డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని చిత్ర రెస్టారెంట్ అండ్ బార్‌కు నియమ నిబంధనలు పాటించకుండా ట్రేడ్ లైసెన్స్ లేకుండానే 2బి లైసెన్స్ రెన్యువల్ చేసి క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
Similar News
News March 25, 2025
విశాఖ : ఈ స్థానాలలో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ నగరం కార్ షెడ్ , కొమ్మాది, రుషికొండ, సింహాచలం, దువ్వాడ, కూర్మన్నపాలెం, పాత గాజువాక, షీలానగర్, మర్రిపాలెం, ద్వారకానగర్ స్థానాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <
News March 25, 2025
మహిళలకు తగ్గిన లీడర్‌షిప్ పొజిషన్లు: టీమ్‌లీజ్

హయ్యర్ లీడర్‌షిప్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 19%కి తగ్గినట్టు టీమ్‌లీజ్ రిపోర్టు తెలిపింది. ఎంట్రీ లెవల్ పొజిషన్లలో 46% ఉన్నట్టు పేర్కొంది. ఇక వారి నిరుద్యోగ రేటు 2.9 నుంచి 3.2%కి పెరిగిందని వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ బాగుందంది. కన్జూమర్ సర్వీసెస్, రిటైల్, విద్య వంటి రంగాల్లో వారికి సీ-సూట్ పొజిషన్లు ఎక్కువగా దక్కుతున్నాయి.
News March 25, 2025
హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం

TG: హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్నిప్రమాదాలు, వరద ముంపు నివారణకు రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు చెరువుల సంరక్షణ, సుందరీకరణ, పునరుద్ధరణపై చర్చించారు.