News April 9, 2025
సిరిసిల్ల: ఆయుధ కారాగారాన్ని ప్రారంభించిన అడిషనల్ డీజీపీ

సిరిసిల్ల పట్టణ పరిధి పెద్దూరులో 17th బెటాలియన్లో నూతనంగా నిర్మించిన ఆయుధ కారాగారాన్ని అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ క్రమశిక్షణ కలిగిన ఆర్గనైజేషన్ అని తెలిపారు. ప్రతిఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
మోడల్ ఫామ్ డెమో హౌస్ను సందర్శించిన కలెక్టర్

బూర్గంపాడు మండలంలోని ఎంపీ బంజర గ్రామంలో ఏర్పాటు చేసిన మోడల్ ఫామ్ డెమో హౌస్ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం సందర్శించారు. వ్యవసాయ ఆధారిత బహుముఖ ఆదాయ వనరులను గ్రామస్థులకు చేరువ చేయడమే దీని లక్ష్యమని ఆయన తెలిపారు. గ్రామీణాభివృద్ధి, సేంద్రియ వ్యవసాయంపై రూపొందించిన ఈ మోడల్ ఫామ్ జిల్లా స్థాయిలో ఆదర్శ ప్రదర్శనగా నిలుస్తుందని కలెక్టర్ కొనియాడారు.
News November 28, 2025
శ్రీశైలంలో డిసెంబర్-1 నుంచి ఉచిత లడ్డూ కౌంటర్.!

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆలయ ఛైర్మన్ గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి రూ.500, రూ.300 టికెట్ పొందిన భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాద కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు తెలిపారు. అలాగే నూతన డొనేషన్ కౌంటర్, కైలాస కంకణముల కౌంటర్, ధర్మకర్తల మండలి చాంబర్ ప్రారంభించటంతోపాటు శ్రీ గోకులం ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.
News November 28, 2025
నెల్లూరు: విలీనం.. ఆదాయానికి గండే..!

నెల్లూరు జిల్లాలో మైకా, క్వార్ట్జ్, గ్రావెల్ వంటి ఖనిజ సంపద, అలాగే షార్, నేలపట్టు, వెంకటగిరి చేనేత వస్త్రాలు వంటి పర్యాటక ప్రాంతాలు తిరుపతి జిల్లాలో కలిసిపోయాయి. దీని వలన నెల్లూరు జిల్లాకు ఖనిజాలు, పర్యాటకం రూపంలో వచ్చే ఆదాయ వనరులు తరలిపోయాయి. ఇక నెల్లూరుకు కృష్ణపట్నం పోర్టు, రొట్టెల పండుగ మాత్రమే మిగలడం జిల్లా మనుగడకే సవాలుగా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.


