News March 6, 2025

సిరిసిల్ల: ఆయుర్వేద వైద్యం పేరుతో మోసం, వ్యక్తి అరెస్టు: డిఎస్పీ

image

ఆయుర్వేద వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అజయ్ అనే వ్యక్తి జిల్లాలో పక్షపాతం తగ్గిస్తానని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు

Similar News

News December 9, 2025

2,569 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

image

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇప్పటివరకు అప్లై చేసుకోనివారు చేసుకోవచ్చు. DEC 12వరకు ఫీజు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.35,400 చెల్లిస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 9, 2025

పార్వతీపురం: మంత్రి చుట్టూ రోజుకో వివాదం.. పూటకో రగడ

image

మంత్రి సంధ్యారాణి చుట్టూ రోజుకో వివాదం నడుస్తోంది. ఇటీవల పచ్చకామెర్లతో గురుకుల పాఠశాల విద్యార్థులు మృతి చెందడంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మంత్రి PA వేధిస్తున్నాడని సాలూరుకు చెందిన మహిళ పోలీసులుకి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. తాజాగా తన తల్లి <<18505977>>మరణానికి<<>> మంత్రి అనుచరుడి వేధింపులే కారణమని ఓ మహిళ కలెక్టర్‌కి ఫిర్యాదు చేసింది. మంత్రి అనుచరుల వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందని లోకల్ టాక్.

News December 9, 2025

తిరుపతి: అర్చకుల మధ్య వివాదం.. అందుకోసమేనా.?

image

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకుల మధ్య <<18509949>>కోల్డ్‌వార్<<>> కాకరేపుతోంది. ఆలయంలో కొత్తగా నాలుగు పరిచారకుల పోస్టుల భర్తీ కానున్నాయి. వీటిని దక్కించుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అనాధికారిక వ్యక్తులను పరిచారికులుగా చేర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారట. మరి విజిలెన్స్ అధికారులు దీనిపై విచారణ చేశారా.. లేదా అన్నది తేలాల్సి ఉంది.