News February 13, 2025
సిరిసిల్ల: ఆర్మడ్ రిజర్వ్ విభాగం కీలకం: ఎస్పీ

పోలీస్‌శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకమని సిరిసిల్ల SP అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని సర్ధాపూర్లో జరిగిన సాయుధ దళాల వార్షిక పునర్ ఉచ్చరణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాలంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసు అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అదరపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు, మధుకర్, రమేశ్ పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
రేపు జాగ్రత్త.. ఈ జిల్లాలకు YELLOW ALERT

TG: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News December 6, 2025
ప్రకాశంలో స్క్రబ్ టైఫస్‌తో మహిళ మృతి.. కానీ!

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందినట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఎర్రగొండపాలెం మండలానికి చెందిన వృద్ధురాలు గత నెల 11న అనారోగ్యానికి గురై మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారన్నారు. 29న అక్కడ నిర్వహించిన టెస్టుల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా మృతికి కారణంగా డీఎంహెచ్‌వో తెలిపారు.
News December 6, 2025
వైవీయులో పీజీ ప్రవేశాలకు 8 నుంచి స్పాట్ అడ్మిషన్లు

కడప: YVU P.G (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాలను ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ అఫ్ అడ్మిషన్స్ డా. టి. లక్ష్మీప్రసాద్ తెలిపారు. విద్యార్థులు బరిజనల్ సర్టిఫికెట్లు, నిర్ణీత ఫీజుతో వైవీయులోని డీవోఏ ఆఫీసులో సంప్రదించాలన్నారు. ఏపీ పీజీ సెట్ రాయని వారు కూడా రావచ్చన్నారు. వివరాలకు
yvu.edu.in ను సంప్రదించాలని సూచించారు.


