News February 14, 2026
సిరిసిల్ల: ఆ నలుగురిలో ఎవరికి పీఠం దక్కెదెవరికి..?

సిరిసిల్ల పుర పీఠంపై బీఆర్ఎస్‌లో పోటీ పెరిగింది. గెలిచిన అభ్యర్థుల్లో చైర్మన్ కోసం ప్రధానంగా నలుగురు పోటీలో ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ చైర్ పర్సన్, 3వ వార్డు కౌన్సిలర్ జిందం కళ, 30వ వార్డు కౌన్సిలర్ మంచే రేణుక, 5వ వార్డు కౌన్సిలర్ దార్నం అరుణ, 36వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుక ఆశావాహుల్లో జాబితాలో ఉన్నారు. KTR ఆశీస్సులు ఎవరికి ఉండనున్నాయో, పీఠం దక్కేదేవరికో అని పట్టణంలో జోరుగా చర్చ సాగుతుంది.
Similar News
News March 13, 2026
VKB: గ్యాస్ సరఫరాలో అక్రమాలకు తావుండొద్దు: కలెక్టర్

వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఓ గ్యాస్ ఏజెన్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ నిల్వలు, పంపిణీ రికార్డులను పరిశీలించి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలకు తావివ్వకుండా, సకాలంలో సిలిండర్లను సరఫరా చేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు, అధికారులకు స్పష్టం చేశారు.
News March 13, 2026
స్పెర్మ్ రేసింగ్ ప్రపంచకప్.. లక్ష డాలర్ల ప్రైజ్ మనీ!

పురుషుల్లో ఫెర్టిలిటీపై అవగాహనకు ఓ US స్టార్టప్ వినూత్నంగా స్పెర్మ్ రేసింగ్ ప్రపంచకప్ నిర్వహిస్తోంది. విజేతలకు $1,00,000 (₹92.33L) ప్రైజ్ మనీ ఇస్తారు. హెల్త్, శాంపిల్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మైక్రోస్కోప్‌లో వీర్యకణాలకు క్వాలిఫయింగ్ రేస్, హెడ్ టు హెడ్, ఫైనల్ నిర్వహిస్తారు. 2025లో USలో $10,000 క్యాష్ ప్రైజ్‌తో నిర్వహించిన రేస్ సక్సెస్ కావడంతో ఈసారి 128 దేశాల అథ్లెట్లతో టోర్నీ జరపనుంది.
News March 13, 2026
నిర్మల్: ఈ నెల 16న ప్రజావాణి రద్దు

జనాభా గణన నేపథ్యంలో ఈ నెల 16న కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించబడడం లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.


