News January 25, 2025
సిరిసిల్ల: ఇద్దరు మాజీ నక్సలైట్లు అరెస్టు

సిరిసిల్ల సిటీకి చెందిన ఇద్దరు మాజీ నక్సలైట్లతో పాటు మరొక వ్యక్తిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. పట్టణానికి చెందిన మర్రిపల్లి శ్రీనివాస్, రమేష్, సందీప్ పెద్దూర్ శివారులో వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిని తిరిగి మాకే ఇవ్వాలని బెదిరించిన మాజీ నక్సలైట్లులక్ష్మణ్, ప్రసాద్ అలాగే మరోవ్యక్తి రాజుపై కేసు నమోదుచేసి అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు.
Similar News
News December 14, 2025
కుప్పం: పేలిన నాటు బాంబు.. పరిస్థితి విషమం

కుప్పం (M) కొట్టాలూరు పంచాయతీ ఎర్రమన్ను గుంతలు సమీపంలో నాటు బాంబు పేలి చిన్న చిన్న తంబి (38) తీవ్రంగా గాయపడ్డాడు. చిన్న తంబి శరీరం ఓవైపు పూర్తిగా కాలిపోవడంతో అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం కుప్పం PES ఆసుపత్రికి తరలించారు. చిన్న తంబి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కుప్పం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 14, 2025
అత్యధిక స్థానాలు మావే: పీసీసీ చీఫ్

TG: పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాల్లోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమష్టిగా కష్టపడ్డారని చెప్పారు. గ్రామీణ ఓటర్లు ప్రభుత్వ పాలనపై నమ్మకం ఉంచారని, ఇది తమ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా సర్కారు ముందుకు సాగుతోందని వివరించారు.
News December 14, 2025
నెల్లూరు: వేదాయపాళెం రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేదాయపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. నెల్లూరు నగరం వేదాయపాలెంలోని జనశక్తి నగర్‌కు చెందిన వొలిపి వెంకటేశ్వర్లు (63) జీవితంపై విరక్తి చెంది వేదాయపాళెం రైల్వే స్టేషన్‌లోని సౌత్ యార్డ్ వద్దకు వచ్చి రైలు కింద పడ్డాడు. మృతదేహం గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జు అయింది. రైల్వే ఎస్ఐ హరిచందన కేసు దర్యాప్తు చేస్తున్నారు.


