News March 12, 2025
సిరిసిల్ల: ఈనెల 13న జాబ్మేళా

ఈనెల 13వ తేదీన సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో జరిగే జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి నీల రాఘవేందర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. SSC, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన మహిళ అభ్యర్థులు సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఈనెల 13న ఉదయం 11 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరుకావాలని సూచించారు.
Similar News
News December 23, 2025
నూతన పింఛన్లకు మార్గదర్శకాలు రాలేదు: జిల్లా కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నూతన పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కేవలం స్పౌజ్ కేటగిరీ కింద భర్త మరణించిన వితంతువులకు మాత్రమే పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర కేటగిరీల దరఖాస్తుదారులు మార్గదర్శకాలు వచ్చే వరకు వేచి ఉండాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.
News December 23, 2025
కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా గోపికృష్ణ, రాజ్ కుమార్

రాజన్నసిరిసిల్ల జిల్లా కోర్టుల్లో కేంద్రప్రభుత్వ వివిధ శాఖల తరఫున కేసులు వాదించేందుకు అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులను నియమిస్తూ భారత న్యాయమంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వేములవాడకు చెందిన సీనియర్ న్యాయవాదులు కేశన్నగారి గోపికృష్ణ, రేగుల రాజ్ కుమార్లకు ఈ బాధ్యతలు దక్కాయి. ఇకపై జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో కేంద్రప్రభుత్వానికి సంబంధించిన కేసులను వీరిద్దరూ పర్యవేక్షించనున్నారు.
News December 23, 2025
తిరుపతి ప్రజలకు గమనిక

తిరుపతి జిల్లాలో ఆసక్తి ఉన్నవాళ్లు ‘యువ ఆపద మిత్ర’కు దరఖాస్తు చేసుకోవాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి జి.విజయ్ కుమార్ కోరారు. 18 నుంచి 40ఏళ్ల లోపు అర్హులని చెప్పారు. ఈనెల 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ పొందిన వారు జిల్లాలో ఏవైనా విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున సహాయక చర్యల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.


