News February 5, 2025

సిరిసిల్ల : ఈనెల 15 నుంచి ఫౌండేషన్ కోర్సులకు ఉచిత కోచింగ్

image

RRB, SSC, BANKING రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్స్‌కు ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ఈనెల 15 నుంచి నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రాజా మనోహర్ రావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగ అభ్యర్థులు ఈ నెల 9 వరకు ఆన్‌లైన్‌లో www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Similar News

News November 19, 2025

ప్రెగ్నెన్సీలో అవకాడో తింటే..

image

అవకాడో గర్భిణులకు ఔషధ ఫలం అంటున్నారు నిపుణులు. ఇది సంతానోత్పత్తి, పిండం అభివృద్ధి, జనన ఫలితాలు, తల్లి పాల కూర్పును ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు శరీరం విటమిన్లను శోషించుకునేలా చేస్తాయి. అధిక పీచువల్ల ఆకలి తగ్గి, బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఫోలిక్ ఆమ్లం గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ లోపాలు రాకుండా చూస్తుందని చెబుతున్నారు.

News November 19, 2025

సంగారెడ్డి: రేపటి నుంచి బడిబాటి పిల్లల సర్వే

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 20 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు బడిబాట పిల్లల సర్వే నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. సీఆర్పిలు, ఐఈఆర్పీలు DLM T తమ ప్రాంతాల పరిధిలో బడిబాట పిల్లల సర్వేలు నిర్వహించాలని సూచించారు. బర్త్ డే పిల్లల వివరాలను ప్రబంధ పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు.

News November 19, 2025

సంగారెడ్డి: పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత: ఎస్పీ

image

పోలీస్ సిబ్బందికి పంపిణీ చేసే గ్యాస్ ఆటోను ఎస్పీ పారితోష్ పంకజ్ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసు సంక్షేమానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్యాస్ ఆటో ద్వారా త్వరగా సిలిండర్ అందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.