News April 12, 2025
సిరిసిల్ల: ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

ఈనెల 21 లోపు ముంపు గ్రామాల ప్రజలు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజలు ఈనెల 11 నుంచి 21 వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News April 20, 2025
తంగళ్ళపల్లి: వలకు చిక్కిన భారీ చేప

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన జాలరు గోలాడ నరేశ్‌కు వలలో 32.5 కిలోల భారీ బొచ్చ చేప చిక్కింది. రోజు లాగానే సిరిసిల్లలోని మిడ్ మానేరులో చేపలు పట్టడానికి వెళ్లగా వలలో భారీ చేప చిక్కిందని నరేశ్ తెలిపాడు. ఇంతవరకు ఎప్పుడూ ఇంత పెద్ద చేప ఎప్పుడు చిక్కలేదని, మొదటిసారిగా ఇంత పెద్ద చేపను పట్టుకున్నామని నరేశ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ భారీ చేపను చూడడానికి స్థానికులు ఆసక్తి చూపారు.
News April 20, 2025
సిరిసిల్ల :సోమవారం ప్రజావాణి రద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం తెలిపారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 21 సోమవారం హై కోర్టు కేసు విషయంలో వ్యక్తిగతముగా హాజరవుతున్న కారణంగా అందుబాటులో ఉండటం లేదన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News April 20, 2025
మగవాళ్లకూ ‘హీ’ టీమ్స్ ఉండాలి: పురుషులు

మహిళలకు ‘షిీ’ టీమ్స్‌లాగే పురుషులకు కూడా ‘హీ’ టీమ్స్ ఉండాలని భార్యాబాధితులు డిమాండ్ చేశారు. భార్యల చిత్రహింసల నుంచి తమను కాపాడాలంటూ దేశంలోని వివిధ రాష్ట్రాల భార్యాబాధితులు ఢిల్లీలోని ధర్నా చౌక్‌లో ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువమంది బాధితులు పాల్గొన్నారు. వీరంతా ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’ పేరుతో ఆందోళన చేపట్టారు. తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా కూడా ఇందులో పాల్గొనడం విశేషం.