News March 13, 2025

సిరిసిల్ల: ఉపాధ్యక్షురాలుగా లావణ్య లింగారెడ్డి

image

సిరిసిల్ల జిల్లా బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలిగా తంగళ్ళపల్లికి చెందిన ఆసాని లావణ్య లింగారెడ్డిని నియమించినట్టు జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో లావణ్య లింగారెడ్డికి ఆమె గురువారం నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలువురు లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 24, 2026

వనపర్తి: ఇంటర్, పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.

News February 24, 2026

NLG: సొంతింటి కల.. పాలకుల మాయాజాలం!

image

రాజకీయ చదరంగంలో పేదల సొంతింటి కల కేవలం ఓటు బ్యాంకు పావుగా మారుతోంది. ఎన్నికల వేళ హామీల వర్షం కురిపిస్తున్న పాలకులు, తీరా గెలిచాక ఆ ఇళ్లను గాలికొదిలేస్తున్నారు. నల్గొండలో కోట్ల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలు నేడు పాలకుల నిర్లక్ష్యంతో పాడుబడుతున్నాయి. చూడ్డానికి కోటలా ఉన్నా, నివసించడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులకు అందక ఈ ఇళ్లు నేడు శిథిలావస్థకు చేరుతున్నాయి.

News February 24, 2026

వనపర్తి: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

వనపర్తి జిల్లాలో రేపటి నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఎస్పీ సునీత రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 25 పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.