News March 13, 2025

సిరిసిల్ల: ఉపాధ్యక్షురాలుగా లావణ్య లింగారెడ్డి

image

సిరిసిల్ల జిల్లా బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలిగా తంగళ్ళపల్లికి చెందిన ఆసాని లావణ్య లింగారెడ్డిని నియమించినట్టు జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో లావణ్య లింగారెడ్డికి ఆమె గురువారం నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలువురు లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News July 11, 2025

కోనసీమ: ధాన్యం బకాయిలు రూ.188.87 కోట్లు విడుదల

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన రబీ ధాన్యం బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. 9,505 మంది రైతులకు రూ.188.87 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 32,996 మంది వద్ద 2,69,986 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రూ. 620.98 కోట్లు విలువైన ధాన్యం కొన్నారు.

News July 11, 2025

కృష్ణా: క్రియాశీలక రాజకీయాలకు నాని, వంశీ రెడీ

image

ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ MLAలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తిరిగి రాజకీయంగా చురుగ్గా మారేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో YCP ఓటమి, వంశీ అరెస్ట్, నాని ఆరోగ్య సమస్యలు వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరూ ప్రజల కంటపడకుండా ఉన్నారు. నాని కొన్ని సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చినప్పటికీ, వంశీ పూర్తిగా మౌనంగా ఉన్నారు. గుడివాడలో జరగనున్న YCP సమావేశంతో వీరు రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారు.

News July 11, 2025

VJA: మరికొద్ది గంటలలో ముగియనున్న గడువు

image

అమరావతిలోని ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌(APDDCF)లో కాంట్రాక్ట్ పద్ధతిన 9 మేనేజర్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. డైయిరీ టెక్నాలజీలో బీటెక్ చదివిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని APDDCF అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://apddcf.ap.gov.inలో జులై 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి రూ.30 వేల వేతనం ఇస్తామన్నారు.