News January 3, 2025

సిరిసిల్ల: ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం వాసి జక్కుల అనూష(18) గురువారం ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అనూష తంగళ్లపల్లి మండలం బద్దనపెల్లిలోని గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అనూష తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. 3 రోజుల క్రితం ఇంటికి వచ్చిన ఆమె ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Similar News

News November 17, 2025

KNR: ప్రైవేటు ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీ

image

కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో డీఎంహెచ్‌ఓ డా. వెంకటరమణ స్పెషల్ డ్రైవ్ టీమ్‌తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రుల్లోని రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, ఫామ్(F) డాక్యుమెంట్లను పరిశీలించారు. మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ (MTP), అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ (ART) చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

మహిళా పోలీసులకు ‘షి-లీడ్స్’ శిక్షణ ప్రారంభం

image

మహిళా పోలీసులు ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సంఘటనలను ఎదుర్కొనేలా వినూత్నమైన ‘షి-లీడ్స్’ శిక్షణను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు. ధర్నాలు, నిరసనలలో, ముఖ్యంగా మహిళా నిరసనకారులను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ శిక్షణలో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. మహిళా పోలీసుల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ దోహదపడుతుందని సీపీ తెలిపారు.