News January 3, 2025
సిరిసిల్ల: ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం వాసి జక్కుల అనూష(18) గురువారం ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అనూష తంగళ్లపల్లి మండలం బద్దనపెల్లిలోని గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అనూష తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. 3 రోజుల క్రితం ఇంటికి వచ్చిన ఆమె ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Similar News
News January 25, 2025
కరీంనగర్ మేయర్ సునీల్ రావు చేరికపై స్పందించిన బండి సంజయ్
బీజేపీలో నగర మేయర్ సునీల్ రావు చేరనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మేయర్ తో కలిసి మరికొంత మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వస్తారన్న వార్తలపై బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ సూచన మేరకు పరిమిత సంఖ్యలో కార్పొరేటర్లతో కలిసి బీజేపీలో మేయర్ సునీల్ రావు చేరుతున్నారు. భూ కబ్జాలు, నేరచరిత్ర ఉన్నవాళ్లను బీజేపీలో చేర్చుకోబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు.
News January 24, 2025
స్మార్ట్ సిటీ ద్వారా KNR అభివృద్ధి అయ్యిందంటే.. అది బండి సంజయ్ వల్లే: మేయర్
స్మార్ట్ సిటీ పై కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు(బీఆర్ఎస్) సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వల్లే కరీంనగర్‌కు రూ.428 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు మంజూరయ్యాయని అన్నారు. 2017లోనే కరీంనగర్ ను ‘స్మార్ట్ సిటీ’గా ఎంపిక చేసినా నిధులు రాలేదు అని తెలిపారు. స్మార్ట్ సిటీ ద్వారా కరీంనగర్ అభివృద్ధి అయ్యిందంటే అది బండి సంజయ్ వల్లే అని అన్నారు.
News January 24, 2025
నేడు కరీంనగర్‌కు రానున్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ KNR లో పర్యటించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ తో కలిసి మల్టీపర్పస్ స్కూల్లో చేపట్టిన పార్కు పనులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు అనుబంధ పనులు, హౌసింగ్ బోర్డ్ కాలనీ 24/7 తాగునీటి సరఫరా, కుమ్మర్ వాడి హై స్కూల్ లో డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు. డంపింగ్ యార్డ్‌ని సందర్శిస్తారు.