News March 13, 2025
సిరిసిల్ల :ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ నేతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి గీతేను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటా ఆగయ్య నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చక్రపాణి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు లక్ష్మీనారాయణ, మురళి, శ్రీనివాస్, సర్దార్ ఉన్నారు.
Similar News
News March 21, 2025
మెదక్: 10338 మందికి 68 సెంటర్లు

నేటి నుంచి మెదక్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 సెంటర్లలో 10338 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 17 సెట్టింగ్స్ స్క్వాడ్స్, 68 చీఫ్ సూపర్డెంట్లు, 70 డిపార్ట్మెంటల్ అధికారులు, 590 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు.
News March 21, 2025
నల్గొండ: మూల్యాంకనం తేదీలో మార్పు..!

ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సివిక్స్ పరీక్షలకు సంబంధించి ఈనెల 22న జరగాల్సిన మూల్యాంకనం 21వ తేదీ (శుక్రవారం)కి మార్చినట్లు డీఐఈఓ దస్రూ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జామినర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 21, 2025
నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మండలంలో బసంతనగర్ మరియు జయ్యారం ప్రభుత్వ పాఠశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎంఈఓ విమల తెలిపారు. బసంతనగర్ 261 జయ్యారంలో 97 మంది రెండు కేంద్రాలలో కలిపి 358 మంది పరీక్షలు రాయనున్నారని అలాగే పరీక్ష సమయం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయని తెలిపారు.