News March 26, 2025
సిరిసిల్ల: ఏప్రిల్ 11లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముంపు గ్రామాల బాధితులు ఏప్రిల్ 11 లోపు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలోని అన్నపూర్ణ, శ్రీ రాజరాజేశ్వర జలాశయం కింద ముంపునకు గురైన బాధితులు అప్లయ్ చేసుకోవాలని సూచించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
Similar News
News April 1, 2025
విశాఖ వస్తున్న యుద్ధ నౌకలు

భారత్, అమెరికా సంయుక్తంగా విశాఖలో ఇవాళ్టి నుంచి టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు చేయనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో పరస్పర సహకారంలో భాగంగా ఇరు దేశాలు ఈ విన్యాసాలు చేపడుతున్నాయి. 13 రోజుల పాటు బంగాళాఖాతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 యుద్ధ నౌకలు విశాఖకు తరలివస్తున్నాయి. ఇరు దేశాల వైస్ అడ్మిరల్, రియల్ అడ్మిరల్ స్థాయిలో పరస్పర చర్చలు జరగనున్నాయి.
News April 1, 2025
ఆదిలాబాద్లో పెరిగిన చికెన్ ధరలు

పండగల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో చికెన్ విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతోపాటు చికెన్ ధరలు సైతం పెరిగాయి. ఆదిలాబాద్ పట్టణంలో కిలో రూ:200, స్కిన్ లెస్ రూ:220 ధర పలుకుతుంది. కొన్నిచోట్ల డిమాండ్ ను బట్టి అమ్ముతున్నారు. గత నెలలో కిలో రూ.160 నుంచి 180 వరకు విక్రయాలు జరిపారు. గత రెండు నెలలుగా గిరాకి లేక ఇబ్బందులు పడ్డ వ్యాపారులకు.. తిరిగి చికెన్ విక్రయాలు ఊపందుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News April 1, 2025
హైదరాబాద్లో జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్

TG: హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో జర్మనీ దేశానికి చెందిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. లిఫ్ట్ ఇస్తామని ఆమెను కారులో ఎక్కించుకున్న దుండగులు మార్గంమధ్యలో ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.