News January 22, 2025

సిరిసిల్ల: ఏ ప్రభుత్వం చేయని విధంగా పథకాల అమలు: మంత్రి పొన్నం

image

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రుద్రంగి మండలంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూగ్రామ సభలలో ప్రతిపక్ష పార్టీ నాయకులు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని కోరారు. జనవరి 26 నుంచి ప్రారంభించి అర్హత ప్రకారం రేషన్ కార్డులను అందరికీ జారీ చేస్తామని అన్నారు.

Similar News

News February 16, 2025

జుక్కల్‌: బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

జుక్కల్ మండల కేంద్రానికి చెందిన బిజ్జవార్ చంద్రమోహన్ ఇవాళ ఉదయం పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ భువనేశ్వర్ తెలిపారు. మృత దేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి పంపించినట్లు వివరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 16, 2025

పెబ్బేరు: భారీ మొసలిని పట్టుకున్న కృష్ణ సాగర్

image

పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ సమీపంలో నరసింహ అనే రైతు వరి పొలంలో భారీ మొసలిని చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే వనపర్తి జిల్లా సాగర్ స్నేక్స్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణ సాగర్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణసాగర్ తన బృందంతో మొసలిని చాకచక్యంగా పట్టుకుని బంధించారు.  

News February 16, 2025

కల్వకుర్తి: ‘స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’ 

image

ఎర్రవల్లి – గోకారం జలాశయ బాధితులు, ఎర్రవల్లి గ్రామ పంచాయితీ ప్రజలు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలను మూకుమ్మడిగా బహిష్కరించారు. ఊర్లోకి ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రచారానికి రావడానికి వీలు లేదని హెచ్చరించే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జలాశయ సామర్థ్యం తగ్గించి ఎర్రవల్లి గ్రామపంచాయితీ ముంపుకు గురికాకుండా ఉంటుందని ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు.

error: Content is protected !!