News February 1, 2025
సిరిసిల్ల: కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి: ఎన్నికల అధికారి

శాసనమండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోల్డింగులు, గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించారు.
Similar News
News February 12, 2025
నల్గొండ: జిల్లాలో మొత్తం 1911 పోలింగ్ స్టేషన్లు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ప్రకటించారు. ఈ మేరకు జడ్పీ సీఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి మంగళవారం జాబితాను విడుదల చేశారు. నల్గొండ జిల్లాలో మొత్తం 1911 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. 400 మంది ఓటర్ల వరకు 145 పోలింగ్ స్టేషన్లు, 401 నుంచి 500 మంది ఓటర్ల వరకు 420 పోలింగ్ స్టేషన్లు, 501 నుంచి 750 మంది ఓటర్ల వరకు 1,346 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
News February 12, 2025
వాలంటైన్స్ వీక్: ఇవాళ HUG DAY

ప్రేమను వ్యక్తపరిచేందుకు అనేక రకాల మార్గాలున్నాయి. ఫిజికల్ ఎఫెక్షన్‌ను చూపించేందుకు వాలంటైన్స్ వీక్‌లో ఇవాళ హగ్ డే జరుపుకొంటారు. ప్రేమను, ధైర్యాన్ని, భరోసాను ఇలా వ్యక్తపరుస్తూ ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. హగ్ ఇవ్వడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా బీపీ కంట్రోల్‌లో ఉంటుందట. హాయికరమైన నిద్ర, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు.
News February 12, 2025
42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: ఆర్ కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రిజర్వేషన్లు పెంచకుండా కులాల వారీగా జనాభా లెక్కలు తప్పుగా చూపిస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.