News March 11, 2025

సిరిసిల్ల: కమాండెంట్ పార్థివదేహానికి నివాళులర్పించిన కలెక్టర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా TGSP 17 బెటాలియన్ కమాండెంట్ టి.గంగారం(55) లిఫ్ట్ లోకి అడుగు వేసి ప్రమాదవశాత్తు సోమవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన కమాండెంట్ గంగారాం పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా నివాళులు అర్పించారు. 

Similar News

News November 24, 2025

విజేతలుగా కడప జిల్లా టీంలు

image

పులివెందలలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్‌లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్‌గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతే గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.

News November 24, 2025

రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

image

హైదరాబాద్‌లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్‌పై ఈ రైడ్స్ జరిగాయి.

News November 24, 2025

కొమురం భీమ్‌కు SP నివాళి

image

జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నితికా పంత్ కెరమెరి (M) జోడేఘాట్‌లోని ఆదివాసీ నాయకుడు కొమరం భీమ్ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎస్పీ, ఏఎస్పీకి ఆదివాసీ పెద్దలు పూల మొక్కలు అందించి, తలపాగా చుట్టి ఘనస్వాగతం పలికారు. గిరిజన ఆచార సంప్రదాయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. మారుమూల గిరిజన ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.