News January 26, 2025
సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ఝా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 3, 2025
ఇండిగోలో సిబ్బంది కొరత.. పలు ఫ్లైట్లు ఆలస్యం, రద్దు

సిబ్బంది కొరతతో పలు ఇండిగో విమాన సర్వీసులు లేట్గా నడుస్తుండగా, కొన్ని రద్దవుతున్నాయి. మంగళవారం 35% ఫ్లైట్లు మాత్రమే సమయానికి నడిచినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన 200 సర్వీసులు రద్దయ్యాయి. నవంబర్లో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇండిగోలో పైలట్లు, ఫ్లైట్ సిబ్బంది కొరత ఎదుర్కొంటోంది.
News December 3, 2025
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

చిత్తూరు జిల్లాలో బుధవారం కురిసిన వర్షపాత వివరాలను అధికారులు తెలియజేశారు. విజయపురంలో అత్యధికంగా 24.2 మీ.మీ వర్షపాతం నమోదయింది. కార్వేటి నగరంలో 18, వెదురుకుప్పంలో 12.6, సోమలలో 12.4, రొంపిచర్ల 9.2, ఎస్.ఆర్ పురంలో 7.2, పాలసముద్రం 6.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది.
News December 3, 2025
NZB: రూ.17 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

NZB పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ పోలీస్ సబ్ డివిజన్కు సంబంధించి 170 మంది బాధితులు ఫోన్లు పోగొట్టుకున్నరు. రూ.17 లక్షల విలువైన ఫోన్లను బాధితులకు ACP రాజా వెంకటరెడ్డి అందజేశారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in)లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు.


