News March 9, 2025
సిరిసిల్ల: కార్పొరేట్ స్థాయి విద్య: కలెక్టర్

సర్కార్ బడిలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో కార్పొరేట్ స్థాయి వసతులు అందిస్తూ ఆంగ్ల మాధ్యమం ద్వారా గుణాత్మక విద్యను అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా విద్యా బోధన అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
Similar News
News March 26, 2025
నత్తనడకన LRS ఫీజు చెల్లింపు ప్రక్రియ

ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31తో రాయితీ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా 99,913 దరఖాస్తులు ఉండగా.. 61,343దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత సాధించాయి. ఇందులో 5,731 మంది దరఖాస్తుదారులే ఫీజు చెల్లించారు. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.
News March 26, 2025
కడపలో ఎన్నిక వాయిదా వేయాలని పిటిషన్.. ఉత్కంఠ

ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఎన్నికకు TDP పోటీ చేయమని చెప్పింది. పైగా YCPకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ తరుణంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఎన్నికను వాయిదా వేయాలని గోపవరం ZPTC సభ్యుడు జయరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నేడు తీర్పు రానుండగా, గురువారం ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
News March 26, 2025
విశాఖ అభివృద్ధిపై కలెక్టర్ నివేదిక.. అంశాలివే..!

➤ 98 ఎకరాల్లో 5 సోలార్ ప్లాంట్లు, 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
➤ ట్రాఫిక్ నియంత్రణకు 72.82 కి.మీ. పొడవున 15 రహదారులు జూన్ నాటికి పూర్తి
➤ జీవీఎంసీ పరిధిలో ఐదు చోట్ల వర్కింగ్ విమెన్ హాస్టల్స్
➤ పరదేశిపాలెంలో రూ.70లక్షలతో కాలేజీ అమ్మాయిలకు హాస్టల్ భవనం నిర్మాణం
➤ రూ.కోటితో కేజీహెచ్ ఓపీ, క్యాజువాలటీ ఆధునీకరణ
➤ విశాఖ పోర్టులో క్రూయిజ్ టూరిజం ప్రారంభం
➤ బీచ్‌లో హోప్ ఆన్, హోప్ ఆఫ్ బస్సు సర్వీసులు