News March 7, 2025
సిరిసిల్ల: కార్యదర్శులకు మెమోలు జారీ

సిరిసిల్ల జిల్లాలో సమయపాలన పాటించని కార్యదర్శులకు మెమోలు జారి చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీ అధికారి శేషాద్రి తెలిపారు. వెల్జిపూర్, పొత్తూరు, ఓబులాపూర్, వల్లంపట్ల, కిష్టారావుపల్లి, తెలుగువారిపల్లి, పెద్ద లింగాపూర్, వెంకటరావుపల్లి, గంభీరావుపేట(M)లోని నర్మల, లక్ష్మీపూర్, ముస్తఫా నగర్, తంగళ్లపల్లి(M) నర్సింహులపల్లి, బద్దెనపల్లి, అంకిరెడ్డిపల్లి, బాలమల్లుపల్లి కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు.
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


