News August 1, 2024
సిరిసిల్ల: కుక్కల దాడిలో వృద్ధురాలి మృతి
సిరిసిల్ల జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో బుధవారం రాత్రి వృద్ధురాలు పిట్ల రాజ్యలక్ష్మి (80) ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి చొరబడ్డ వీధి కుక్కలు వృద్ధురాలిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం రోజురోజుకూ ఎక్కువ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Similar News
News October 8, 2024
డబుల్ డోస్‌తో నాని మూవీ: శ్రీకాంత్ ఓదెల
డబుల్ డోస్‌తో నాని మూవీ ఉంటుందని డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ పేర్కొన్నారు. మంగళవారం చీకురాయిలో మాజీ జడ్పీటీసీ బండారు రామ్మూర్తి డైరెక్టర్ శ్రీకాంత్‌ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రంతో నానితో ఉంటుందన్నారు. దసరాను మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం ఉండనుందని ఆయన తెలిపారు.
News October 8, 2024
జగిత్యాల: ఉపాధి కల్పనకు కసరత్తు
ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ కూలీలకు చేతినిండా పని కల్పించడానికి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించారు. వచ్చే నెలలో మండలాల వారిగా ప్రణాళికలు ఖరారు చేయనున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల జాబ్ కార్డుల పరిధిలో 2.73 లక్షల మంది కూలీలు ఉన్నారు.
News October 8, 2024
సిరిసిల్ల: పత్తి కొనుగోలు కేంద్రాలకు మౌలిక వసతుల కల్పన
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో వచ్చే పత్తి పంటను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కలెక్టరేట్‌లో పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్‌ను అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.