News February 7, 2025
సిరిసిల్ల: కుక్కల వల్ల చిన్నారికి సోకిన వైరస్

కోనరావుపేట(M) కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ(4) అనే చిన్నారికి జ్వరంతో పాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది. అవి ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్నిరకాల పరీక్షలు చేసినా నిర్ధారణ కాకపోవడంతో 4రోజుల క్రితం HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రూసెల్లా ఇథి పీకల్ వైరస్ గా గుర్తించారు. కుక్కల కారణంగా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు.
Similar News
News November 22, 2025
పల్నాడు కోడిపోరు తిరునాళ్ల నేడే..!

పల్నాడు చరిత్రలో ముఖ్య ఘట్టమైన కోడిపోరు శనివారం కారంపూడిలో జరగనున్నది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తిరునాళ్ల నిర్వహిస్తారు. బ్రహ్మనాయుడు కోడి పుంజు చిట్టిమల్లుతో నాగమ్మ కోడిపుంజు శివంగి డేగ పోటీ పడుతుంది. ఈ కోడి పోటీలో నాగమ్మ మోసం చేసిందనే ఉద్దేశం పల్నాటి యుద్ధానికి అంకురార్పణ జరిగింది. నాటి కోడిపందేలను తలపింప చేస్తూ నేడు వైరి వర్గాలు నిర్వహించే ఈ పోటీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు.
News November 22, 2025
నిజామాబాద్: మహిళా CIకి బెదిరింపులు.. CPకి ఫిర్యాదు

భారీగా డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యాదు చేస్తానంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై NZB ఎక్సైజ్ CI స్వప్న CP సాయిచైతన్యకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తెలంగాణ కల్లుగీత వృత్తిసంఘం అధ్యక్షుడిగా చెప్పుకొనే దానయ్యగౌడ్ అనే వ్యక్తి పలుమార్లు ఫోన్ చేసి తనకు డబ్బులివ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని CI స్వప్న CPకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
News November 22, 2025
HNK: బావ ఇంటికి బావమరిది కన్నం

బావ ఇంట్లో దొంగతనం చేసిన బావమరిదిని HNK జిల్లా మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఐలవేని సాయి రోహిత్ (26)ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆరు నెలల కిందట బావ బూతగడ్డ సతీష్ ఇంట్లో దొంగతనం చేసినట్టు ఒప్పుకొన్నాడు. అతడి వద్ద నుంచి రూ. 4.36 లక్షల విలువైన 47.05 గ్రా. బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పుల్యాల కిషన్ తెలిపారు.


