News February 7, 2025
సిరిసిల్ల: కుక్కల వల్ల చిన్నారికి సోకిన వైరస్

కోనరావుపేట(M) కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ(4) అనే చిన్నారికి జ్వరంతో పాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది. అవి ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్నిరకాల పరీక్షలు చేసినా నిర్ధారణ కాకపోవడంతో 4రోజుల క్రితం HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రూసెల్లా ఇథి పీకల్ వైరస్ గా గుర్తించారు. కుక్కల కారణంగా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు.
Similar News
News December 7, 2025
స్మృతితో పెళ్లి రద్దు.. పలాశ్ ఏమన్నారంటే?

స్మృతి మంధానతో పెళ్లి రద్దుపై పలాశ్ ముచ్చల్ SMలో పోస్ట్ పెట్టారు. ‘పర్సనల్ రిలేషన్షిప్ నుంచి తప్పుకుంటున్నా. జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. నాపై వచ్చిన నిరాధారమైన వదంతులు బాధించాయి. గాసిప్ల ఆధారంగా ఎవరినీ జడ్జ్ చేయవద్దనే విషయాన్ని సమాజం నేర్చుకోవాలి. నాపై తప్పుడు కంటెంట్ను వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
News December 7, 2025
అనంతపురంలో అన్నదమ్ములు మృతి..!

ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి అన్నదమ్ములు నరేంద్ర(32), చరణ్(25) మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బ్రహ్మసముద్రం మండలానికి చెందిన చరణ్ కాలు జారి నీటికుంటలో పడ్డాడు. అన్న నరేంద్ర అతణ్ని కాపాడేందుకు నీటి కుంటలోకి దూకాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
News December 7, 2025
ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉన్నట్టే!

* పాదాలు తిమ్మిరిగా లేదా మండుతున్నట్టుగా అనిపిస్తుంది
* ఉన్నట్టుండి బాడీకి షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది.
* పని మీద శ్రద్ధ పెట్టలేక ఇబ్బంది పడతారు.
* అన్ని సమయాలలోనూ అలసిపోయిన భావన కలుగుతుంది.
* చిన్న విషయాలను కూడా పదే పదే మర్చిపోతుంటారు.
* మెట్లు ఎక్కేటప్పుడు కాళ్లు బలహీనంగా అనిపిస్తాయి.


