News March 31, 2025

సిరిసిల్ల: కుటుంబ సభ్యుల పాత్ర కీలకం: కమాండెంట్

image

ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో కుటుంబసభ్యుల బాధ్యత చాలా కీలకమని సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధి పెద్దూరులోని బెటాలియన్‌లో ఆర్ఎస్ఐ వై నారాయణ ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్తవ్య నిర్వహణ కోసం తమ సుఖసంతోషాలను త్యాగంచేసి శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితం అవుతారని స్పష్టంచేశారు. ఉద్యోగవిరమణ అనంతరం కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలన్నారు.

Similar News

News September 17, 2025

HYD: ప్రపంచాన్ని ఆకర్షించేలా మూసీని మారుస్తాం: సీఎం

image

మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.

News September 17, 2025

HYDలో జాతీయ జెండా ఆవిష్కరించిన కవిత

image

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఎంకే. మొయినుద్దీన్‌ని శాలువా పూలమాలలతో సత్కరించారు.

News September 17, 2025

గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ

image

TG: గ్రూప్-1 మెయిన్స్‌ <<17655670>>ఫలితాలను<<>> రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ నెల 9న ఫలితాలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.