News January 29, 2025
సిరిసిల్ల: కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం

సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత మాట్లాడుతూ.. వ్యాధిపై అవగాహన పెంచుకొని అపోహలను దూరం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంపత్, అనిత, శివరామకృష్ణ, శ్రీనివాస్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 16, 2025
KNR: విటమిన్ గార్డెన్ పై దృష్టి పెట్టాలి:కలెక్టర్

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విటమిన్ గార్డెన్లపై బయోసైన్స్ ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. గార్డెన్లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడంతో పాటు, పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లోని విటమిన్లు, మినరల్స్ గురించి కూడా విద్యార్థులకు వివరించాలని ఆమె సూచించారు.
News November 16, 2025
KNR: ‘కుక్కకాటు బాధితులకు ప్రత్యేక పర్యవేక్షణ అవసరం’

కుక్కలు, కోతులు కరిచిన వారికి అందిస్తున్న చికిత్సపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం హౌసింగ్ బోర్డు కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన వృద్ధులతో మాట్లాడి, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్తారని వారికి సూచించారు.
News November 16, 2025
KNR: SRR కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలోని జంతు శాస్త్ర విభాగం ప్రథమ సంవత్సర విద్యార్థులు జిల్లా కేంద్రంలోని జింకల పార్కును క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు. వారి పాఠ్యాంశంలోని వివిధ రకాల పక్షులను జంతువులను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు. ఈ క్షేత్ర పర్యటనలో జంతుశాస్త్ర విభాగాధిపతి డా.కిరణ్మయి, రవీందర్ రావు, డా.టి.మహేష్, సమత, ప్రీతి, సాయి చరణ్, విద్యార్థులు పాల్గొన్నారు.


