News January 29, 2025
సిరిసిల్ల: కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం

సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత మాట్లాడుతూ.. వ్యాధిపై అవగాహన పెంచుకొని అపోహలను దూరం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంపత్, అనిత, శివరామకృష్ణ, శ్రీనివాస్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 18, 2025
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం రాగా అతడిని అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అతని వద్ద నుంచి 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News February 18, 2025
వరంగల్: టూరిస్టుల కోసం స్పెషల్ బస్సు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రదేశాల సందర్శన కోసం టూరిజం సంస్థ ప్రత్యేక ఏసీ బస్సును ఏర్పాటు చేసింది. ఈనెల 20న ఉదయం 7.45కు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప, లక్నవరం, రాత్రి ఖిలా వరంగల్ సందర్శన అనంతరం రాత్రి 8 గంటలకు హన్మకొండకు చేరుకుంటుంది. పెద్దలకు రూ.980లు, పిల్లలకు రూ.790లుగా టికెట్ ధర నిర్ణయించారు.