News May 19, 2024

సిరిసిల్ల: కూతురిని హతమార్చిన తల్లిదండ్రుల అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

image

కన్నకూతురిని హత్యచేసిన తల్లిదండ్రుల్ని రిమాండ్‌కు తరలించామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన చెప్యాల ఎల్లవ్వ- నర్సయ్య దంపతులకు కూతురు ప్రియాంక ఉంది. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఆమె ప్రవర్తన తీరుపై కోపగించుకున్న తల్లిదండ్రులు ఈనెల 14న ఆమెను హత్యచేశారు. ఆదివారం నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే మృతురాలికి పెళ్లై, 13 నెలల బాలుడు ఉండటం గమనార్హం.

Similar News

News November 20, 2025

కరీంనగర్: ‘హెల్ప్ లైన్ 1098కు సమాచారం ఇవ్వండి’

image

బాలల హక్కుల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బాలల దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల సంరక్షణ చట్టాలపై అందరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. పాఠశాలలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తూ, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా 1098 హెల్ప్ లైన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

News November 20, 2025

రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొన్నం

image

కరీంనగర్ జిల్లాలో రేపు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఎల్ఎండీ కాలనీ వద్ద చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లోని సారధి కళామందిర్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటారు.

News November 20, 2025

హనుమాన్ నగర్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

కరీంనగర్‌లోని హనుమాన్ నగర్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడిని కోహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తించారు. మేస్త్రీ పని చేసుకుంటూ కొంతకాలంగా ఒంటరిగా కిరాయి ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.