News September 24, 2024

సిరిసిల్ల: కూతురు కష్టాలు తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

image

కన్న కూతురి కష్టాలను తట్టుకోలేక ఓ తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన శ్రీనివాస్(50) కూతురు రమ్యను 11 ఏళ్లక్రితం సిరిసిల్ల రాజునగర్‌కు చెందిన శ్రీకాంత్‌తో పెళ్లి చేశాడు. తన కూతురిని అల్లుడు చిత్ర హింసలు పెడుతున్నాడని తీవ్ర మనస్తాపానికి గురై వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News December 5, 2025

ఎన్నికల భద్రతపై సమీక్షించిన సీపీ

image

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రతపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 104 రూట్లు, 57 క్లస్టర్లను ఏర్పాటు, 508 మళ్లీ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, భద్రతా ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 4, 2025

కరీంనగర్‌: మూడు గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

కరీంనగర్ జిల్లా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడుచోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చొప్పదండి మండలం దేశాయిపేటలో తిరుపతి, పెద్దకురుమపల్లిలో స్వరూప ఏకగ్రీవం కాగా, రామడుగు మండలం శ్రీరాములపల్లిలో సుగుణమ్మ సర్పంచ్‌గా ఖరారయ్యారు. దేశాయిపేటలో సర్పంచ్‌తో పాటు పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా తెలిపారు.

News December 4, 2025

కరీంనగర్‌ జిల్లాలో 276 వార్డు సభ్యులు ఏకగ్రీవం

image

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల ఏకగ్రీవాల సంఖ్య పెరిగింది. చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని మొత్తం 866 వార్డులకు గాను, 276 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 590 వార్డులకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.