News February 12, 2026
సిరిసిల్ల: కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సిరిసిల్ల, వేములవాడలలో ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రాల వద్ద 250 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత నిర్వహిస్తున్నామని, 163 BNSS (144 సెక్షన్) అమలు చేస్తున్నామన్నారు.
Similar News
News March 15, 2026
వనపర్తి: పీఆర్సీని అమలు చేయాలి: తపస్

ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని తపస్ వనపర్తి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణ, శశివర్ధన్‌లు డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన వినతిపత్రాన్ని ఆదివారం MLA మేఘారెడ్డికి ఆయన నివాసంలో యూనియన్ ఆధ్వర్యంలో అందజేశారు. వారు మాట్లాడుతూ.. పీఆర్సీ పైన ప్రభుత్వం వెంటనే స్పందించేలా చూడాలని, అలాగే పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. వరప్రసాద్ గౌడ్, విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
News March 15, 2026
రేపు కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
News March 15, 2026
మంచిర్యాల: అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు సమన్వయంతో కృషి చేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం, తాగునీరు, కనీస మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.


