News December 18, 2024

సిరిసిల్ల: క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్

image

మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాస్థాయి నాకు సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. గంజాయి సాగు, నివారణ చర్యలు, మాదకద్రవ్యాల వాడకంపై నియంత్రణ చర్యలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ఉచితంగా ప్రచారం చేయాలని సూచించారు.

Similar News

News January 21, 2025

ఇచ్చిన మాట ప్రకారం నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: పొన్నం

image

సిరిసిల్ల చేనేత కార్మికులకు ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫాం చీరల ఆర్డర్ ఇచ్చి పెద్ద ఎత్తున పని కల్పించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు అందించే ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అందరికీ ఒకే రంగు గల ఒక్కొకరికి ఒక్కో చీరను అందజేసేందుకు 4.24 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్స్ అందజేసినట్లు పేర్కొన్నారు.

News January 21, 2025

KNR జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి గ్రామ సభలు

image

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా అధికారులకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేయడంతో వారికి మరోసారి అవకాశమివ్వాలని గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి అర్హులను అధికారులు ఎంపిక చేయనున్నారు.

News January 21, 2025

కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి పొన్నం

image

నేటి నుంచి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కొరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్న సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటి సభ్యులు పాల్గొనాలని కోరారు.