News February 26, 2026

సిరిసిల్ల: ఖాళీగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్ట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పోస్టు ఖాళీగా మిగిలింది. గత అక్టోబరు నెలలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా నియమితులైన గరీమా అగ్రవాల్.. జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా సైతం అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఐఏఎస్ అధికారుల తాజా బదిలీలలో ఆమెను జిల్లా కలెక్టర్‌గా నియమించారు. ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) పోస్టులో ఎవరినీ నియమించకపోవడంతో ఆ పోస్టు ఖాళీగా మిగిలిపోయింది.

Similar News

News April 12, 2026

విశాఖ: కటకటాల్లోకి ఏసీ శాంతి.. ఉద్యోగం నుంచి సస్పెండ్

image

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ACB అధికారులు ఏసీ శాంతిపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 7న చేపట్టిన తనిఖీల్లో రూ.1.37 CR అక్రమాస్తులను గుర్తించి అరెస్టు చేశారు. కోర్టు 21వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను విజయవాడ జైలుకు తరలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 48 గంటలకు పైగా కస్టడీలో ఉన్నందున, ఉన్నతాధికారులు శాంతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి ఉమ్మడి విశాఖలో ఏసీగా పనిచేశారు.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్‌లోనూ మేడ్చల్ FIRST

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మేడ్చల్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 64,146 మంది పరీక్షలు రాయగా 53,071 మంది పాసై 82.73 శాతంతో స్టేట్‌లోనే ఫస్ట్‌ వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1,280 మందికి 922మంది పాసై 72.03%తో 23వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 6,106 మందికి 1,904 మంది పాసై 31.18%తో 21వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 95 మందికి 54 మంది పాసై 56.84%తో 10th ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. హనుమకొండకు 8వ ర్యాంక్

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. హనుమకొండ(D)లో రెగ్యులర్ విద్యార్థులు 17,435 మంది పరీక్షలు రాయగా 13,698 మంది పాసై 78.57 శాతంతో స్టేట్‌లోనే 8వ ర్యాంక్ వచ్చింది.ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1003 మందికి 740 మంది పాసై 73.78 శాతంతో 19వ స్థానంలో నిలవగా, రెగ్యులర్ ప్రైవేట్‌లో 1537 మందికి 530 మంది పాసై 34.48%తో 13వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 35 మందికి 22 మంది పాసై 62.86%తో 7వ ర్యాంక్ వచ్చింది.