News February 17, 2025
సిరిసిల్ల: గంజాయితో పట్టుపడ్డ వ్యక్తి అరెస్టు

రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగిలో గంజాయితో పట్టుబడిన వ్యక్తిని రిమాండ్కు తరలించినట్టు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గంగాధర మండలానికి చెందిన పొత్తూరి రాకేశ్ అనే వ్యక్తి రుద్రంగిలో గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు తెలిపారు. ఎన్డిపీఏస్ చట్టం ప్రకారం గంజాయి కలిగి ఉండటం, రవాణా చేయటం, తాగటం, అమ్మటం నేరమని తెలిపారు. ఎవరైనా, ఎక్కడైనా గంజాయి కలిగి ఉన్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News November 26, 2025
ఏలూరు: రాజ్యాంగ పీఠికపై ప్రమాణం

ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు రాజ్యాంగ పీఠికను అనుసరిస్తామని ప్రమాణం చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి మాట్లాడుతూ.. జాతీయ న్యాయదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటామన్నారు. భారత రాజ్యాంగంపై యువతకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
News November 26, 2025
గద్వాల: జీపీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: ఈసీ

గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజర్వేషన్లు, విడతల వివరాలు, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలను టీఈ-పోల్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం నోడల్ ఆఫీసర్ను నియమించి, గ్రీవెన్స్ ప్లాట్ఫామ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
News November 26, 2025
సింహాచలం ఆలయ ప్రతిష్ఠ మసకబారింది: గంటా

గత వైసీపీ హయాంలో సింహాచలం దేవాలయాన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మార్చారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తాలూకా అవశేషాలు దేవస్థానంలో ఇంకా ఉన్నాయన్నారు. ఉద్యోగ వ్యవహారాలు, విరాళాలు, బంగారు ఆభరణాల లెక్కలు.. ఇలా అనేక అంశాల్లో వస్తున్న ఆరోపణలు ఆలయ ప్రతిష్ఠను మసక బారుస్తున్నాయని అన్నారు.


