News July 10, 2024

సిరిసిల్ల: గుండెపోటుతో గల్ఫ్ కార్మికుడి మృతి

image

గుండెపోటుతో ఓ గల్ఫ్ కార్మికుడు మృతిచెందిన ఘటన తంగళ్లపల్లి మండలంలోని మల్లాపూర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజేశ్ ఉపాధి నిమిత్తం గత పదేళ్లుగా గల్ఫ్‌లో ఉంటున్నాడు. 6 నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Similar News

News October 12, 2024

విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక: మంత్రి పొన్నం

image

రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయదశమి జరుపుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరు ఆ దుర్గాభవాని అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆయుఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అన్ని పనుల్లో విజయం సాధించాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ పెద్దల ఆశీర్వాదం తీసుకొని భవిష్యత్తులో విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.

News October 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ లో రెస్టారెంట్లలో తనిఖీలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కథలాపూర్ మండలంలో సైబర్ మోసం. @ వీర్నపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు, స్కూటర్ డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ వేములవాడ: అనారోగ్యంతో ప్రధానోపాధ్యాయురాలు మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న దుర్గ నవరాత్రి ఉత్సవాలు. @ దసరా పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్న జగిత్యాల ఎస్పీ.

News October 11, 2024

KNR: దసరా ఉత్సవాలకు ముస్తాబైన శ్రీధుర్గాభవానీ ఆలయం

image

కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌ లోని శ్రీధుర్గాభవానీ ఆలయం దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. దసరా పండుగా సందర్భంగా శనివారం అమ్మవారు విజయలక్ష్మి అలంకరణలో గజ వాహనంతో భక్తులకు దర్శనమిస్తారు అని వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ తెలిపారు. ఆలయంలో ఉదయం 8 గంటల నుంచి వాహన పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటలకు వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో శమ్మిపూజ, రావణ సంహారం కార్యక్రమాలు జరుగుతాయి.