News January 26, 2025

సిరిసిల్ల : గ్రామసభలో వచ్చిన మొత్తం దరఖాస్తులు 40,360

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామసభలు, 67 వార్డులలో విజయవంతంగా నిర్వహించామని, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. నూతనంగా 16,505 రేషన్ కార్డు దరఖాస్తులు, 14,542 ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, 141 రైతుభరోసా దరఖాస్తులు, 9,172 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దరఖాస్తులు మొత్తం 40,360 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 4 నూతన పథకాల లాంచింగ్‌కు ప్రభుత్వ ఆదేశాల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామన్నారు.

Similar News

News December 5, 2025

దోస్త్ మేరా దోస్త్

image

మన దేశంలో ప్రభుత్వాలు మారినా రష్యాతో సంబంధాలు మాత్రం అలాగే ఉన్నాయి. 1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో అమెరికా పాక్‌కు సపోర్ట్ చేసింది. అయితే సోవియట్ యూనియన్ (ఇప్పుడు రష్యా) భారత్ వైపు నిలబడింది. బంగాళాఖాతంలో సబ్‌మెరైన్‌తో మోహరించగానే అమెరికా సైన్యం భయపడి వెనక్కి వెళ్లిపోయింది. దీంతో ఆ యుద్ధంలో భారత్ గెలిచింది. మనం వాడుతున్న యుద్ధవిమానాల్లో 80% రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే కావడం విశేషం.

News December 5, 2025

చెరువు మట్టితో చాలా లాభాలున్నాయ్

image

చెరువులోని పూడిక మట్టిని పొలంలో వేస్తే భూమికి, పంటకు చాలా మేలు జరుగుతుంది. చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరతాయి. వేసవిలో చెరువులు అడుగంటుతాయి. అప్పుడు చెరువు మట్టిని పొలాల్లో వేస్తే నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియ కర్భన పదార్థాలతో పాటు.. మొక్కల పెరుగుదలకు కావాల్సిన సూక్ష్మ జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు నేలలో వృద్ధి చెందుతాయి.

News December 5, 2025

రంప: పాఠశాలలో ఆడుకుంటు..కుప్పకూలిన విద్యార్థిని

image

రంపచోడవరం మండలం తామరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల‌లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. 4వ తరగతి విద్యార్థిని కె. జానుశ్రీ పాఠశాలలో తోటి విద్యార్థులతో ఆడుకుంటుండగా..ఫీట్స్‌ వచ్చి పడి పోయింది. బాలిక పేరెంట్స్, టీచర్స్ హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారరు.