News January 26, 2025
సిరిసిల్ల : గ్రామసభలో వచ్చిన మొత్తం దరఖాస్తులు 40,360

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామసభలు, 67 వార్డులలో విజయవంతంగా నిర్వహించామని, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. నూతనంగా 16,505 రేషన్ కార్డు దరఖాస్తులు, 14,542 ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, 141 రైతుభరోసా దరఖాస్తులు, 9,172 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దరఖాస్తులు మొత్తం 40,360 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 4 నూతన పథకాల లాంచింగ్‌కు ప్రభుత్వ ఆదేశాల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామన్నారు.
Similar News
News February 14, 2025
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి సహకరించాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి రైతులు తమ భూములు అందించి సహకరించాలని కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్రీన్ ఫిల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి భూ సేకరణ కోసం సంగెం గ్రామానికి చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశాభివృద్ధికి రహదారులు చాలా అవసరమని తద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు.
News February 14, 2025
GBS బాధితులకు ఉచిత వైద్యం: మంత్రి సత్యకుమార్

APలో 17 గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) వైరస్ కేసులు <<15225307>>వెలుగు చూశాయని<<>> వైద్యశాఖ వెల్లడించింది. గుంటూరు, విశాఖలో ఐదు చొప్పున, కాకినాడలో 4, విజయవాడ, అనంతపురం, విజయనగరంలో ఒక్కో కేసు బయటపడ్డాయని పేర్కొంది. బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్స అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 8వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు.
News February 14, 2025
సహకార సంఘాల కాలపరిమితి పెంపు

తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. 904 సహకార సంఘాల కాలపరిమితి, 9 DCCB ఛైర్మన్ల పదవీకాలన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటితో గడువు ముగుస్తున్నా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో పాలకవర్గాల గడువును ప్రభుత్వం పొడిగించింది.