News March 12, 2025

సిరిసిల్ల: గ్రూప్-1లో సత్తా చాటిన హరిణి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన కన్నం హరిణి గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో 499.5 మార్కులు సాధించింది. హరిణి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం వదిలేసి పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News November 12, 2025

కోనసీమ: టెన్త్ విద్యార్థులకు alert..షెడ్యూల్ విడుదల

image

2025-26 విద్యాసంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైనట్లు డీఈవో సలీంబాషా తెలిపారు. రెగ్యులర్, ఫెయిల్ అయిన వారు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 13 – 25 వరకు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 3 వరకు చెల్లించవచ్చన్నారు.

News November 12, 2025

APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<>CCRAS<<>>) 5 కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 21న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. BAMS, MD, MS(ఆయుర్వేదం), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. https://ccras.nic.in/

News November 12, 2025

సిద్దిపేట: దయ జూపరా మాపై కొడుకా!

image

అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు మిట్టపల్లి వెంకటయ్య, లక్ష్మి తమ ఇద్దరు కుమారులు బాగోగులు చూసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి సంపాదించిన 8 ఎకరాల భూమిని ఇద్దరికీ రెండు భాగాలుగా పంచి ఇచ్చినప్పటికీ ఎవరు కూడా చూడడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తిండి పెట్టాలని అడిగినందుకు కొట్టి, కాళ్లు విరగొట్టారని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.