News March 12, 2025

సిరిసిల్ల: గ్రూప్-2 ఫలితాలు.. సత్తచాటిన యువకుడు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ చెందిన ఎగుమామిడి అఖిల్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రంలో 34వ ర్యాంక్ సాధించాడు. అఖిల్ రెడ్డి చిన్ననాటి నుంచి చదువులో ముందు ఉండేవాడని గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News October 29, 2025

మాదకద్రవ్యాల నివారణకు కృషి చేయాలి: ASF కలెక్టర్

image

జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తో కలిసి జిల్లాలో మాదకద్రవ్యాల నివారణపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలని సూచించారు.

News October 29, 2025

రేపటి నుంచి పాఠశాలలు యథాతదం: డీఈవో

image

ఏలూరు జిల్లాలో తుఫాను ప్రభావం తగ్గిన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి యథాతథంగా కొనసాగనున్నట్లు డీఈవో వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాను కారణంగా పాఠశాల ప్రాంగణాలు దెబ్బతినలేదని స్పష్టత తీసుకున్న తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతించాలని డీఈవో సూచించారు. ఈ మేరకు బుధవారం రాత్రి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

News October 29, 2025

KNR కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

తుఫాన్ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వర్షాల నేపథ్యంలో సహాయం కోసం 0878 2997247కు కాల్ చేయాలన్నారు. భారీ వర్షాలు వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.