News March 12, 2025
సిరిసిల్ల: గ్రూప్-2 ఫలితాలు.. సత్తచాటిన యువకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ చెందిన ఎగుమామిడి అఖిల్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రంలో 34వ ర్యాంక్ సాధించాడు. అఖిల్ రెడ్డి చిన్ననాటి నుంచి చదువులో ముందు ఉండేవాడని గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News January 23, 2026
తూ.గో: మసాజ్ ముసుగులో వ్యభిచారం

రాజమండ్రి జేఎన్ రోడ్డులోని రెండు మసాజ్ సెంటర్లపై బుధవారం రాత్రి ప్రకాష్ నగర్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. రెండు మసాజ్ సెంటర్లలో మసాజ్ పేరుతో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News January 23, 2026
NZB: మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కసరత్తు

మేయర్ పదవీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో నిజామాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, BJP తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. తమదే మేయర్ పీఠం అంటూ ఇరు పార్టీల నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ముందే పూర్తిస్థాయిలో BJP, కాంగ్రెస్ హడావుడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి సుమారు 700, బీజేపీ నుంచి 500 వరకు ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవడంతో గెలిచే వారి కోసం సర్వేలు చేపట్టారు.
News January 23, 2026
నిర్మల్ మున్సిపల్ పీఠం కోసం బీజేపీ ప్లాన్

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం బీజేపీ శక్తివంతంగా ప్రీ-ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలతో కలిసి టికెట్-ఎంపిక, అభ్యర్థుల సామర్థ్యం, ఓటర్ల భావోద్వేగాన్ని అంచనా వేసే సమీక్షలు జరుగుతున్నాయి. రాజకీయ వర్గాల ప్రకారం బీజేపీ ముఖ్యంగా కొన్ని కీలక వార్డుల్లో గట్టి ప్రచారానికి సిద్ధంగా ఉంది. ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండా ప్రకటించనుందని భావిస్తున్నారు.


