News February 11, 2025

సిరిసిల్ల: చందుర్తిలో బెల్ట్ షాపులపై దాడులు

image

చందుర్తి మండలం రామరావుపల్లె, ఎనగల్, జోగాపూర్ గ్రామాల్లోని బెల్టుషాపులపై CHD పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఎన్గల్ గ్రామానికి చెందిన కుసుంభ లింగయ్య వద్ద రూ.7,630 విలువ గల మద్యాన్ని, జోగాపూర్‌లో రూ.3,850 విలువ గల మద్యం, రామరావుపల్లె గ్రామానికి చెందిన ముని రాములు వద్ద రూ.17,650లు మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్‌హెచ్ఓ ఆశోక్ కుమార్ తెలిపారు.

Similar News

News March 19, 2025

నేడే బడ్జెట్.. జనగామ జిల్లాకూ కావాలి నిధులు..!

image

నేడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న చెన్నూరు రిజర్వాయర్, పాలకుర్తి రిజర్వాయర్, జనగామ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇండస్ట్రియల్ పార్కులు, పాలకుర్తిలో 100 పడకల ఆసుపత్రితో పాటు పలు కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

News March 19, 2025

సిద్దిపేట: ముగ్గురు ఎంపీడీవోలకు పదోన్నతి

image

సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో ఎంపీడీవోలుగా పనిచేస్తున్న ఏ. ప్రవీణ్, జయరాం, ఏపీడీగా పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్‌లకు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీ రాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు వెలువరించారు.

News March 19, 2025

సన్న వడ్లకు రూ.500 బోనస్‌‌పై UPDATE

image

TG: సన్న రకం వడ్లకు రూ.500 బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. వానకాలం పంటకు సంబంధించి రూ.1200 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ నిన్న ఆమోదం తెలిపిందని ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు.

error: Content is protected !!