News February 6, 2025

సిరిసిల్ల: చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షుడిగా గోనె ఎల్లప్ప

image

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా సిరిసిల్ల పట్టణానికి చెందిన గోనె ఎల్లప్పను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ గురువారం తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలో గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ.. చేనేత రంగానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.

Similar News

News November 19, 2025

పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ ఎలా?

image

పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు లీటరు నీటికి థయోడికార్బ్1.5 మి.లీ (లేదా) ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. (లేదా) క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి. పత్తి పంట చివరి దశలో ఉన్నట్లైతే ఒక లీటరు నీటికి సింథటిక్ పైరిత్రాయిడ్ మందులైన సైపర్ మిత్రిన్ 25% ఇసి 1.0 మి.లీ. (లేదా) థయోమిథాక్సామ్ + లామ్డా సైహలోత్రిన్ 0.4 మి.లీ. (లేదా) సైపర్మెథ్రిన్ + క్లోరిపైరిఫాస్ 2 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి.

News November 19, 2025

తేలని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య

image

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య తేలడం లేదు. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. ఏయే శాఖల్లో ఎంతమంది పనిచేస్తున్నారు? వారికి జీతం ఎంత? ఎన్ని నెలల వేతనం తీసుకున్నారు? పెండింగ్ ఎంత ఉంది? అనే వివరాలు సేకరిస్తున్నాయి. కొన్ని శాఖల్లో సరైన సమాచారం దొరకడం లేదని చెబుతున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వంటి వాటిలో జీతాలు తీసుకోకుండా కొంతమంది పనిచేస్తున్నట్లు వారి దృష్టికి వచ్చింది.

News November 19, 2025

RRB గ్రూప్-D ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల

image

<>RRB<<>> 32,438 గ్రూప్-D పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటిమేషన్ స్లిప్పులు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి నగర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. నవంబర్ 27 నుంచి జనవరి 16వరకు CBT విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. www.rrbcdg.gov.in/ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు ఈనెల 23నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.