News November 9, 2024

సిరిసిల్ల: చేనేత దంపతుల ఆత్మహత్య

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. పట్టణంలోని వెంకంపేట్‌లో భైరి అమర్- స్రవంతి అనే చేనేత దంపతులు శనివారం ఆత్మహత్య
చేసుకున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా పని దొరక్క.. చేసిన అప్పులు తీర్చే మార్గం తెలియక ఇంట్లో బలవన్మరణానికి పాల్పడారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 2, 2024

కోనరావుపేట: ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట

image

ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి, కోనరావుపేట మండలాలకు కేంద్రాలకు అంబులెన్స్ మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ మంజూరు చేయడం పట్ల వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.

News December 2, 2024

ములుగులో ఎన్‌కౌంటర్.. మృతుల్లో పెద్దపల్లి వాసి..!

image

ములుగు జిల్లాలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్‌కు చెందిన ఏగోలపు మల్లయ్య అలియాస్ కోటి(43)ఉన్నారు. కాగా, వారి మృతదేహాలు ములుగు జిల్లా ఏటూరునాగారం ఆసుపత్రిలో ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.

News December 2, 2024

KNR: కొయ్యూరు ఎన్‌కౌంటర్‌కు 25 ఏండ్లు

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కొయ్యూరు ఎన్‌కౌంటర్‌ జరిగి నేటికి 25 ఏండ్లు గడిచింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన నల్లా ఆదిరెడ్డి, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేశ్ ఈ ఎన్‌కౌంటర్‌‌లో మృతి చెందారు. దీనికి గుర్తుగా మావోయిస్టులు బేగంపేటలో స్మారక స్తూపం ఏర్పాటు చేశారు. మావోయిస్టులు డిసెంబర్ 2 నుంచి 9 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.