News April 5, 2025

సిరిసిల్ల: జగ్జీవన్ రామ్ జీవితం తరతరాలకు స్ఫూర్తి: రామదాసు

image

బాబు జగ్జీవన్ రామ్ జీవితం తరతరాలకు స్ఫూర్తి అని బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ జె.రామదాసు అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధి సర్దాపూర్‌లోని పోలీస్ బెటాలియన్‌లో జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామదాసు మాట్లాడుతూ.. దేశంలో హరిత విప్లవం, వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. ఆర్ఐలు ఉన్నారు.

Similar News

News October 20, 2025

కాసేపట్లో భారీ వర్షం..

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాసేపట్లో యాదాద్రి భువనగిరి, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి ఉదయంలోపు వానలు పడతాయని పేర్కొన్నారు. అటు ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

News October 20, 2025

ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఇంట ప్రగతి వెలుగులు: సీతక్క

image

రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట సంక్షేమం, అభివృద్ధి వెలుగులు నిండాయని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2తో పాటు పలు ఉద్యోగ నియామకాలతో నిరుద్యోగుల ఇంట నిజమైన పండుగ జరుగుతోందని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సీతక్క దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

News October 20, 2025

వనపర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు బోనస్ ప్రశ్న..?

image

జిల్లాలో పది రోజుల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో, రబీలో సేకరించిన సన్నధాన్యం బోనస్ ఏమైందని రైతులు ప్రశ్నించే అవకాశం ఉందని పీఏసీఎస్, ఐకేపీ, మెప్మా అధికారులు ఆందోళన చెందుతున్నారు. రబీలో సేకరించిన సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇంకా ఇవ్వలేదన్నారు. ఖరీఫ్ ధాన్యం తెచ్చిన రైతులు రబీ బోనస్ అడిగితే ఏమి చెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.